Singer Kalpana | ముఖం మీదే ఉమ్మేసారు.. సింగర్ కల్పన జీవితంలో అంతా విషాదం..

Singer Kalpana | సింగర్ కల్పన అనే పేరు వినగానే గలగలమని సాగే ఆమె స్వర ప్రవాహం బుల్లితెర ప్రేక్షకులకు వెంటనే గుర్తొస్తుంది. ‘స్వరాభిషేకం’ కార్యక్రమం ద్వారా కల్పన అందరికీ తెలిశారని చెప్పచ్చు. అంతకుముందు ఆమె సినిమాల్లో పాడినప్పటికీ, ఆ కార్యక్రమం ఆమెను జనంలోకి తీసుకెళ్లింది. కల్పన ఏ భాషకి సంబంధించిన పాటనైనా అద్భుతంగా ఆలపిస్తారు. దాంతో ఆమె ఏ ప్రాంతానికి చెందినవారనే విషయం ప్రేక్షకులకు అయోమయాన్ని కలిగిస్తుంది. అంతగా ఆమె ఏ పాట పాడినా అది మాతృభాషలో పాడినట్టుగానే ఉంటుంది.తమిళనాడుకి చెందిన కల్పన .. గాయకుల కుటుంబం నుంచే వచ్చారు. ఆమె తండ్రి టీఎస్ రాఘవేంద్ర సినీ నేపథ్య గాయకుడే .. తల్లి కూడా మంచి గాయని. అందువల్లనే వారు కల్పనకి చిన్నప్పటి నుంచి సంగీతాన్ని నేర్పించారు. బాలనటిగా ఒక వైపున సినిమాల్లో నటిస్తూనే మరో వైపున ఆమె సంగీతాన్ని నేర్చుకున్నారు. ‘మణిశర్మ స్వరకల్పనలో ‘మనోహరం’ సినిమా కోసం ఆమె పాడిన ఒక పాట మంచి పేరును తెచ్చిపెట్టింది.

Singer Kalpana
Singer Kalpana

అప్పటి నుంచి ఆమె తెలుగు సినిమాలలో .. టీవీ షోలతో పాప్యులర్ అవుతూ వచ్చారు.2018లో ఇంటింటి అన్నమయ్య చిత్రంలో నవమూర్తులైనట్టి అనే సాంగ్ కి నంది అవార్డు కూడా అందుకున్నారు. గాయనిగా రాణిస్తూనే అనేక టివి మ్యూజిక్ షోలలో కల్పన పాల్గొన్నారు.కల్పన గాయనిగా అవకాశాలు అందుకుని మంచి గుర్తింపు పొందిన తర్వాత కూడా వర్తమాన సింగర్ తరహాలో ఒక మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. అది మలయాళంలో జరిగిన మ్యూజిక్ కాంపిటీషన్. అందులో కల్పన విజేతగా నిలిచారు. గాయనిగా అవకాశాలు వస్తున్నప్పుడు కంటెస్టెంట్ గా సింగింగ్ కాంపిటీషన్ లో ఎందుకు పాల్గొన్నారు అని యాంకర్ ప్రశ్నించగా.. కల్పన సమాధానం ఇచ్చింది. 2010లో ఆ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నాను.

ఓపెన్ గా చెప్పాలంటే నా జీవితంలో ఆ టైంలో నేను అన్నీ కోల్పోయాను. నా వైవాహిక జీవితం డిజాస్టర్ అయింది. నా కూతురు ఉంది, సంపాదన అంతగా లేదు. ఆ టైంలో నాకు చనిపోవడమే బెటర్ అనిపించింది. అప్పుడు సింగర్ చిత్రమ్మ (చిత్ర) నా ఆలోచనని మార్చే ప్రయత్నం చేశారు. నువ్వు సూసైడ్ చేసుకోవడానికే పుట్టవా అని తిట్టారు. నువ్వు అనుభవించిన కష్టాలు చాలు. నువ్వు దీని నుంచి ఏదో విధంగా బయటపడు అని చెప్పి మలయాళంలో సింగింగ్ కాంపిటీషన్ జరుగుతోంది అని నన్ను రమ్మన్నారు. దీనితో నేను వెళ్లి ఆ షోలో పాల్గొనడం జరిగింది. విజేతగా కూడా నిలిచాను అని కల్పన తెలిపారు. ఆ షోలో పాల్గొనడం వల్ల చాలా మంది నన్ను చాలా మాటలు అన్నారు.

Singer Kalpana
Singer Kalpana

వాస్తవం గా చెప్పాలంటే కొందరు నా ముఖం మీద ఉమ్మేసినట్లు మాట్లాడారు. సింగర్ గా రాణిస్తూ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొంటోంది.. ఏంటి ఈ కక్కుర్తి అని మాట్లాడారు అంటూ కల్పన తెలిపారు. టాలీవుడ్ సింగర్ కల్పన రాఘవేందర్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇటీవల మోతాదుకు మించి నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే, ఆమె ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు వార్తలు రావడంతో ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని ఖండించారు. అయితే, తాజాగా విడుదల చేసిన వీడియోలో కల్పన మాట్లాడుతూ..

Also Read : ప్రకాష్ రాజ్ కి టాలీవుడ్ లో అవకాశాలు లేనట్టేనా.. 

తన భర్త గురించి సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సర్క్యూలేట్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తపై మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేశారు.కల్పన వీడియోలో చెప్పిన వివరాల ప్రకారం.. మీడియాలో నా గురించి, నా భర్త గురించి తప్పుడు ప్రచారం జరుగుతుంది. దానిపై క్లారిటీ ఇవ్వటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను 45 సంవత్సరాల వయసులో పీహెచ్డీ, ఎల్ఎల్ బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నాను. నా భర్తతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు అని కల్పన పేర్కొన్నారు.

Leave a Comment